584 సర్వేనెంబర్ ప్రభుత్వ ఇళ్ల స్థలాల భూమిని స్వాధీనం చేసుకోండి

– అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలాలు కేటాయించండి,
– బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కర్రే వార్ నాగేష్ మండల తాసిల్దార్ కు వినతి,
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోకి వచ్చే సర్వేనెంబర్ 584 లో 3.11 ఎకరాల భూమి ప్రభుత్వ ఇళ్ల స్థలాల భూమిగా రికార్డులో ఉన్న దానిని ఇతరులు కబ్జా చేసి వాడుకుంటున్న భూమిని ప్రభుత్వం వెంటనే ఆ భూమిని స్వాధీనం పరుచుకొని అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నాగేష్ కర్రే వార్ ఆధ్వర్యంలో సోమవారం నాడు మండల తహసిల్దార్ అనిల్ కుమార్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేవంటూ ప్రభుత్వానికి చెందిన ఎకరాలకొద్దీ ప్రభుత్వ భూమిని ఇతరులు అక్రమ కబ్జాలు చేసుకుంటున్న వాటికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. దాదాపు 20 సంవత్సరాల కాలంగా ఒకరు 584 సర్వే నెంబర్లు లో గల 3.11 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసి వాడుకుంటున్నారని అలాంటి వ్యక్తికి ఆ ప్రభుత్వ భూమిని అధికారులు అక్రమంగా పట్ల చేసే ప్రయత్నంలో కొనసాగుతుందని ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమంగా కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లేనియెడల నిరుపేదల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇండ్ల స్థలాల కోసం అక్రమంగా ఉన్న ప్రభుత్వ స్థలం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని తాసిల్దారుకు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ పలువురు నాయకులు కార్యకర్తలు ఇల్లు లేని అర్హులైన నిరుపేదలు పాల్గొన్నారు.

 

Spread the love