యెస్‌ బ్యాంక్‌ ఎన్‌ఐఐలో 8% వృద్థి

న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని యెస్‌ బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) పెరిగడంతో ఆ బ్యాంక్‌ లాభాల్లోనూ వృద్థి చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 10.3 శాతం వృద్థితో రూ.343 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.311 కోట్ల లాభాలు ప్రకటించింది. క్రితం క్యూ1లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.7,584 కోట్లకు చేరింది. గతేడాది ఇదే క్యూ1లో రూ.5,876 కోట్ల ఆదాయం చోటు చేసుకుంది. ఇదే సమయంలో బ్యాంక్‌ వడ్డీపై ఆదాయం రూ,5,135 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ1లో 6,443 కోట్లుగా చోటు చేసుకుంది. నికర నిరర్థక ఆస్తులు 1 శాతానికి తగ్గాయి. 2022 ఇదే జూన్‌ త్రైమాసికంలో నికర ఎన్‌పిఎలు 4.2 శాతంగా ఉన్నాయి.

Spread the love