9-12వ తరగతుల పాఠ్యాంశాల్లో సావర్కర్‌ బయోగ్రఫీ : యూపీ బోర్డ్‌

లక్నో : 9 నుండి 12 తరగతి పాఠ్యాంశాల్లో సావర్కర్‌ బయోగ్రఫీని చేర్చాలని యుపి బోర్డ్‌ నిర్ణయించింది. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ, మహావీర్‌ జైన్‌, పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ, అరబిందో ఘోష్‌, రాజారామ్‌మోహన్‌రారు, సరోజిని నాయుడు, నానాసాహెబ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, రామకష్ణ పరమహంసల జీవిత చరిత్రలతో పాటు సావర్కర్‌ బయోగ్రఫీని చేరుస్తున్నట్లు తెలిపింది. ఎదుగుతున్న, దేశ నిర్మాణంలో పాలుపంచుకునే విద్యార్థుల నైతిక, సాంస్కతిక విలువలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ అధ్యాయాన్ని చేర్చినట్లు యుపి విద్యాశాఖ మంత్రి గులాబ్‌ దేవి పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. యుపి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోవాలని సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పి) పేర్కొంది. బ్రిటీష్‌ పాలకులకు క్షమాపణలు చెప్పి స్వాతంత్య్ర సమరయోధుల మనోభావాలను దెబ్బతీసిన సావర్కర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడమేమిటని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇందుకు యుపి ప్రభుత్వం లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులకు క్షమాపణలు చెప్పాల్సి వుంటుందని ఎస్‌పి ప్రతినిధి సునీల్‌ సాజన్‌ మండిపడ్డారు.

Spread the love