మాంసం అమ్మకాలపై నిషేధం

– కన్వర్‌ యాత్ర సందర్భంగా యూపీ ప్రభుత్వ ఆదేశం
లక్నో ; కన్వర్‌ యాత్ర సాగే మార్గంలో మాంసా న్ని బహిరంగంగా విక్రయించడంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. సీనియర్‌ అధికారుల తో జరిపిన సమీక్షా సమావేశం అనంతరం ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కన్వర్‌ యాత్ర వచ్చే నెల 4వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అధిక మాసం వచ్చినందున శ్రావణ మాసం రెండు నెలల పాటు కొనసాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కాలంలో శ్రావణ శివరాత్రి, నాగపంచమి, రక్షా బంధ న్‌ పండుగలను ప్రజలు జరుపుకుంటారని ఆయన తెలిపారు. భక్తుల మనోభావాలను గౌరవి స్తూ కన్వర్‌ యాత్ర మార్గంలో మాంసాన్ని బహి రంగంగా అమ్మడంపై నిషేధం విధించామని వివరించారు. ఈ మార్గం శుభ్రంగా ఉండాలని, ఎప్ప టికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాల్సి ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొ చ్చారు. మత ప్రాతిపదికన ప్రజలను రెచ్చగొట్టేం దుకు కొందరు దుండగులు ప్రయత్నిస్తారని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశిం చారు. బక్రీద్‌ సందర్భంగా నిర్దేశించిన మార్కెట్‌ ప్రదేశాలలో తప్ప ఎక్కడా జంతువధ జరగకుండా చూడాలని అన్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, ఛాటింగ్‌ యాప్స్‌ ద్వారా మత మార్పిడులు జరుగుతున్నాయని చెబుతూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ సిండికేట్‌ ఈ అక్రమ మత మార్పిడులకు పాల్పడుతోందని ఆరోపించారు. గత సంవత్సరం శ్రావణ మాసంలో కోటి మంది భక్తులు వారణాసిలోని కాశీ విశ్వనాధ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ నెలలో ప్రతి సోమవారం ఆరు లక్షల మంది దేవాల యాన్ని సందర్శిస్తారు.

Spread the love