యూపీలో రెచ్చిపోయిన భూమాఫియా యువ జర్నలిస్టుపై కాల్పులు

– గాయాలతో ఆస్పత్రిలో చికిత్స
– కొన్ని నెలల క్రితమే బెదిరింపుల గురించి తెలిపిన బాధితుడు
లక్నో : బీజేపీ పాలిత యూపీలో భూమాఫియా రెచ్చిపోతున్నది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అని చెప్పుకుంటున్న యోగి పాలనలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. ఉన్నావో ఒక యువ జర్నలిస్టుపై భూమాఫియా కాల్పులకు తెగబడటం అక్కడి కఠిన పరిస్థితులను తెలియజేస్తున్నది. గాయాలపాలైన సదరు జర్నలిస్టు ఆస్పత్రిలో చికిత్సను పొందుతున్నాడు. భూమాఫియా తనను బెదిరిస్తున్నదని కొన్ని నెలల క్రితమే సదరు జర్నలిస్టు వెల్లడించగా.. ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవటం ఆందోళనను కలిగిస్తున్నది. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. యువ జర్నలిస్టు అయిన మన్ను అవాస్తీ(25) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన కుడి భుజానికి గాయాలయ్యాయి. కాన్పూర్‌లోని లాలా లజపత్‌ రారు ఆస్పత్రిలో అవాస్తీ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నదని వైద్యులు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి ఉపయోగించిన ప్రత్యక్ష కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నావ్‌ అదనపు ఎస్పీ (ఏఎస్పీ) శశి శేఖర్‌ సింగ్‌ తెలిపారు. కాగా, ల్యాండ్‌ మాఫియాకు చెందిన నలుగురు సభ్యుల నుంచి తన ప్రాణానికి హాని ఉన్నట్టు ఈ ఏడాది మార్చిలో ఉన్నావ్‌ ఎస్పీ, ఇతర సీనియర్‌ పోలీసు అధికారులకు అవాస్తీ ఫిర్యాదు చేశాడు. రిజిస్ట్రేషన్‌ ప్రదేశాలు లేని కార్లతో తనను వెంబడిస్తున్నారని వీడియోలను ఆయన విడు దల చేశాడు. తాను భూమాఫియా గురించి కథనాన్ని అనుసరిస్తున్నం దునే స్థానిక ఎమ్మెల్యే తనపై ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించాడు. ఘటనపై జర్న లిస్టు సంఘాలు యోగి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో భూ మాఫియా, ఇసుక మాఫియాల చేతిలో జర్నలిస్టులు హత్యకు గురి కావటం తమ భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నదని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సంఘ విద్రోహ శక్తులపై కఠినంగా వ్యహరించి జర్నలిస్టు ల భద్రతకు భరోసాను కల్పించాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్‌ చేశాయి.

Spread the love