హైదరాబాద్ : రిలయన్స్ జియో చౌక ధరలో 4జి ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ.999గా నిర్ణయించింది. ఈ ఫోన్‌తో పాటు కొత్త రూ. 123 ప్లాన్ ప్రకటించింది. ఇది 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు నెలకు 14జిబి డేటాను అందించనున్నట్లు తెలిపింది. ఇప్పటికీ 2జి ఫోన్లను వాడుతున్న వారిని లక్ష్యంగా 4జిలోకి మళ్లించడానికి ఈ ఫోన్‌ను తెచ్చినట్లు పేర్కొంది.