నవతెలంగాణ-నరసింహులపేట
అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించా లని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గునుగంటి మోహన్ డిమాండ్ చేశా రు. అంగన్‌వాడీ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్తంగా 2 రోజుల సమ్మెలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించి ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పా ల్గొన్న సీపీఎం మోహన్ మాట్లాడారు. అనంతరం నిరవధిక సమ్మెను ో సిపిఎం నాయకులు, కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకూబ్, వివిధ పార్టీలు అంగన్వాడి కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. ఈకార్యక్రమంలో అంగన్‌వాడీ ఉద్యోగుల మండల అధ్యక్షురాలు లలిత, సరోజన, శ్రావణి, విమల, ఉపేంద్ర, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అంగన్వాడి ఉద్యోగులు,పాటు ఆయాలు పాల్గొన్నారు.
తొర్రూరు:
అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని సీపీఎం జిల్లా నాయకులు బొల్లం అశోక్, సీఐటియూ మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక అమరవీరుల స్తూపం వద్ద అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని లేనిచో సమ్మె మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మహమ్మద్ యాకూబ్, అంగన్వాడీ సిబ్బంద పాల్గొన్నారు.
మరిపెడ:
అంగన్‌వాడీలను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతన చట్ట ప్రకారంగా 26 వేల రూపాయలు జీతం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.మంగళవారం మరిపెడ పట్టణ కేంద్రంలో రెండో రోజు తెలంగాణ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవర్థిక సమ్మె కు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల గురించి ముఖ్యమంత్రి స్థాయిలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. లేనియెడల అంగన్వాడిల సమ్మెను ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బెస్త సంపూర్ణం, సిపిఎం మండల కార్యదర్శి దుండి వీరన్న, సిఐటియు నాయకులు నందిపాటి వెంకన్న, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు మంద పుష్ప, ప్రధాన కార్యదర్శి కుమ్మరి కుంట్ల జ్యోతి, నాయకురాలు అనబత్తుల రేణుక, గుమ్మడి కళమ్మ, సింతోజ్ లక్ష్మి, ముదిరెడ్డి శ్రీలత, ఉమా, తదితరులు ఉన్నారు.
దంతాలపల్లి:
అంగాన వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (సిఐటియు) పిలుపుమేరకు దంతాలపల్లి మండల వ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు.ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె మంగళవారం రెండవ రోజుకి చేరింది. ఈసమ్మెకు మద్దతు తెలుపుతూ సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గునిగంటి మోహన్, మండల కార్యదర్శి బండి శ్రీనివాస్, మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసి న ప్రభుత్వం తమనెందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని గురించి ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బండి శ్రీనివాస్, సిఐటియు నాయకులు లాక నాగరాజు, వెంకన్న, రమేష్, ఎల్లయ్య, లచ్చన్న, వీరభద్రం, సత్తయ్య, మధు, చిత్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చిన్నగూడూరు:
అంగన్వాడి టీచర్ సమ్మె పట్ల ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు వీడాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి గుంట ఉపేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని దాశరధి ప్రాంగణంలో రెండవ రోజు నిరవధిక సమ్మె కొనసాగింది. ఈసందర్భంగా మాట్లాడుతూ.. అంగన్వాడిలు సమస్యల కోసం సమ్మె చేస్తు ఉంటే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం సమస్యను పరిష్కరించేది పోయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తక్షణమే చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. సత్వరమే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అడుగులు వేయాలన్నారు. లేని పక్షములో సీఐటీయు ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయడానికి వెనకాడ బొమ్మని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి దుండి వీరన్న, జిల్లా సీపీఐ(ఎం) నాయకులు గునిగంటి మోహన్, వెంకన్న, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి యాకన్న, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్:
సమ్మె విచ్చిన్నానికి కుట్ర చేస్తున్న ప్రభుత్వం చేస్తుందని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తాం నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి అజరు సారధి రెడ్డి అంగన్వాడీ యూనియన్ నాయకులు బిందు ఎల్లారీశ్వరి డిమాండ్ చేశారు మానుకోటలో రెండవ రోజు తాసిల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ సమ్మె శిబిరంలో వారు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం లో, కరోనా కష్ట కాలంలో అంగన్వాడీ ల పాత్ర మరువలేనిది అన్నారు, అంగన్వాడీ లకు పెన్షన్ 5వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, సమ్మె ను ఆపాలనీ కొంత మంది కుట్రలు చేస్తున్నారు అన్నారు, ఎన్ని కుట్రలు పన్నినా సమ్మె విజయ వంతంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లు రేశపల్లి నవీన్,, నర్రా శ్రావణ్, కుమ్మరి కుంట్ల నాగన్న, మంద శంకర్, పెరుగు కుమార్,, లలిత, లక్ష్మి నర్సమ్మ, సౌమ్య,ప్రేమ లత, అండాలు, వీర లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు