Sunday, April 26, 2026
E-PAPER
Homeఖమ్మంరేపు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారె పర్యటన

రేపు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారె పర్యటన

- Advertisement -

– కార్యక్రమ వివరాలు వెల్లడించిన కార్యాలయ సిబ్బంది
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొననున్నారు.  ఈ మేరకు ఆదివారం ఆయన కార్యాలయ సిబ్బంది కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఉదయం 9 గంటలకు తిరుమలకుంట గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించనున్నారు.

తర్వాత ఉదయం 10 గంటలకు అశ్వారావుపేటలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల్లో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, సోషల్ మీడియా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు, ఇంచార్జులు, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కార్యాలయ సిబ్బంది విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -