Tuesday, April 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపే టెన్త్ ఫలితాలు..

రేపే టెన్త్ ఫలితాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభ‌వార్త. రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 23వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. వాస్తవానికి మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటించాలని తొలుత భావించినప్పటికీ, ఆ గడువు కంటే ముందే ఫలితాలను విడుదల చేస్తుండటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -