Wednesday, April 29, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీకి 'బుల్డోజర్‌' దెబ్బ

బీజేపీకి ‘బుల్డోజర్‌’ దెబ్బ

- Advertisement -

జంగలేశ్వర్‌ వార్డు కాంగ్రెస్‌ పరం
అహ్మదాబాద్‌
: రాజ్‌కోట్‌ పట్టణంలో కొన్ని నెలల క్రితం నిర్వహించిన భారీ కూల్చివేతల కార్యక్రమం బీజేపీకి గట్టి దెబ్బ కొట్టింది. ఈ పార్టీకి కంచుకోటగా భావించే జంగలేశ్వర్‌ వార్డులో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈ వార్డులోని నాలుగు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ప్యానెల్‌ సభ్యులు విజయం సాధించారు. వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది బీజేపీకి భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గుజరాత్‌ చరిత్రలోనే అతిపెద్ద కూల్చివేత కార్యక్రమం కారణంగానే ఈ వార్డులో కాంగ్రెస్‌ విజయం సాధించిందని విశ్లేషకులు, స్థానికులు అంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,500 మందికి పైగా పోలీసులతో అజీనదీతీరం, టిపి రోడ్డు వెంబడి సుమారు 1,400 గృహాలు, నిర్మాణాలను రాజ్‌కోట్‌ మున్సిపాలిటీ కూల్చివేసింది. ఈ చర్య కార ణంగా కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా ఓటర్లు ఎన్నికల్లో తమ అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారు. గుజరాత్‌ ‘స్థానికంలో బీజేపీ చేతికి తొమ్మిది మున్సిపల్‌ కార్పొరేషన్లు గుజరాత్‌లో ఆదివారం జరిగిన స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమయింది. సాయంత్రం వరకూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన ఫలితాల ప్రకారం తొమ్మిది మున్సిపల్‌ కార్పొరేషన్లలో బీజేపీ విజయం సాధించింది. సురేంద్రనగర్‌, జామ్‌నగర్‌, పోర్‌బందర్‌, కరంసాద్‌-ఆనంద్‌, నదియాద్‌, నవ్‌సరి, వాపి, సురత్‌, మెర్బి మున్సిపల్‌ కార్పొరేషన్లను కమలం పార్టీ గెలుచుకుంది. ఆదివారం మొత్తం 15 మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయితీలు, 260 తాలుకా పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించారు. వచ్చే ఏడాదిలోనే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -