Wednesday, April 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుభావితరాల కోసమే ఫ్యూచర్‌ సిటీ

భావితరాల కోసమే ఫ్యూచర్‌ సిటీ

- Advertisement -

మరో సింగపూర్‌ను సృష్టిస్తాం..ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం
నిరుద్యోగ యువతకు
ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం
ఫ్యూచర్‌సీటీలో కలపమని సమీప గ్రామాల నుంచి వినతులు వస్తున్నాయి
పోలీస్‌ కమిషనరేట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపనలో సీఎం రేవంత్‌రెడ్డి
20మంది మావోయిస్టులకు టూరిస్ట్‌గైడ్‌లుగా నియామకపత్రాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి/కందుకూరు

భవిష్యత్‌ తరాల కోసమే ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. దీన్ని మరో సింగపూర్‌గా తీర్చి దిద్ది, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను అమలు చేస్తుందని స్పష్టంచేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌ రెవెన్యూ పరిధిలో ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ భవనానికి మంగళవారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌రాబు, జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. మల్కాజిగిరి ఆక్టోపస్‌ భవనం, డీసీపీ భవనం, గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ భవనాలకూ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడారు. తమ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ప్రజా పాలనకు కృషి చేస్తోందన్నారు. గ్రామాలను ఫ్యూచర్‌ సిటీలో చేర్చాలని వినతులు వస్తున్నాయని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీ పరిధిలో ఉన్న ఆయా గ్రామాల సర్పంచులు గ్రామసభలు నిర్వహించి, గ్రామసభ పత్రాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికి అందజేయాలని సూచించారు. అనంతరం ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రపంచంలోనే ఉన్నతంగా ఉండాలనే లక్ష్యంతో ఫ్యూచర్‌ సిటీలో పోలీస్‌ కమిషరేట్‌ భవనం నిర్మిస్తున్నామన్నారు. ఫ్యూచర్‌ సిటీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

అభివృద్ధి పనుల్లో పరుగు
60 ఎకరాల్లో స్కిల్‌ యూనివర్సిటీ నిర్మాణ పనులు పూర్తవుతున్నాయనీ, రెండు నెలల్లో స్కిల్‌ భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని 360 కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టామన్నారు. రైతులకు నష్టం కాకుండా గిట్టుబాటు ధర వచ్చేటట్టు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అన్ని శాఖల అధికారులు సామాన్య ప్రజల పట్ల మానవీయ కోణంలో ఆలోచించి, తమ దగ్గరకు వచ్చిన వారి సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

శంషాబాద్‌లో బుల్లెట్‌ రైల్వేస్టేషన్‌
దేశంలో ఏడు బుల్లెట్‌ ట్రైన్స్‌ మంజూరు చేస్తే మూడు మన రాష్ట్రానికే వచ్చాయనీ, బెంగళూరు- హైదరాబాద్‌, శంషాబాద్‌-పూణే, శంషాబాద్‌- అమరావతి-చెన్నై వరకు బుల్లెట్‌ ట్రైన్‌కు మార్గం సుగమమైందని వివరించారు. దీనితో రంగారెడ్డి జిల్లాలో అద్భుతం జరగబోతోందన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దగ్గర మెట్రో రైలు, బుల్లెట్‌ రైలు నిర్మాణం కోసం స్టేషన్లు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రం శాంతి భద్రతలు బాగున్నాయంటే దానికి పోలీసులే కారణమన్నారు. మిగిలిన మావోయిస్టులు జన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 820 మంది మావోయిస్టులు లొంగి పోయారని తెలిపారు. గణపతి అనారోగ్యంగా ఉన్నారని తమకు తెలిసిందనీ, వారు లొంగిపోతే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

జూన్‌ 2న ఎఫ్‌టీడీసీ కార్యాలయం ప్రారంభం
ప్రస్తుత ఫ్యూచర్‌సిటీ ప్రాంతంలో కాలుష్యా న్ని ప్రేరేపించే ఫార్మాస్యూటికల్‌ కంపెనీలను ఏర్పాటు చేయడానికి గత పాలకులు ప్రయత్నాలు చేశారనీ, వాటిని కాదని తాము భవిష్యత్‌ నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. జూన్‌ 2లోగా ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ప్రారం భిస్తామన్నారు.అనంతరం ఇక్కడి నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానిస్తామని తెలి పారు. ఫ్యూచర్‌సిటీ అభివృద్ధిలో భాగంగా నష్టపో తు న్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

ఆదివాసీల అభివృద్ధికి పోలీస్‌ నిధులు : డీజీపీ శివధర్‌రెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టు లకు పునరావాసం కల్పించే విషయంలో టూరి జం, అటవీశాఖలతో కలిసి కొత్త వ్యూహాలు రచించి ముందుకు సాగుతున్నామని తెలిపారు. ముఖ్యం గా, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను ఆనుకొని ఉన్న ఆరు జిల్లాలను ఇంకా సెక్యూరిటీ జోన్‌గానే ప్రభుత్వం చూడటానికి అనుమతించ డంతో ఆ నిధులను కూడా ఆదివాసీల అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నామని చెప్పారు.

మావోయిస్టులు ఇక గిరిదర్శక్‌లు-ఐటీ సుమతి
ఎస్‌ఐబీ ఐజీ సుమతి మాట్లాడుతూ ములుగు, భద్రాచలానికి చెందిన 20 మంది మాజీ మావోయిస్టులను గిరిదర్శక్‌లు(గైడ్స్‌)గా నియమించి, వచ్చే టూరిస్ట్‌లకు వారి చేత గైడ్‌ చేసేలా శిక్షణనిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, కర్రెగుట్టలలోని అనేక అద్భుత ప్రకృతి రమణీయ దృశ్యాలను ప్రచా రంచేస్తూ టూరిస్టులను ఆకర్శించేలా వీరికి శిక్షణనివ్వడం జరుగుతున్నదని చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా మావోయిస్టుల వెంట నడిచిన ఆదివాసీలకు జీవన మార్గాన్ని మరింత మెరుగు చేయడానికి, జీవనోపాధి కల్పించడానికి తాము చేస్తున్న కృషి దేశంలో ఎక్కడా జరగడం లేదనీ, ఇందుకు రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న చేయూతే ప్రధాన కారణమని ఆమె అన్నారు. అనంతరం గిరిదర్శక్‌ లుగా అధికారికంగా ఎంపిక చేసిన 20 మంది ఆదివాసీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామ కపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు వేంనరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారా యణరెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మె ల్యేలు మాల్‌రెడ్డి రంగారెడ్డి, ఆరికెపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, మహేష్‌ భగవత్‌, టీపీసీసీ కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, మార్కెటింగ్‌ కమిటీ చైర్మెన్‌ కృష్ణానాయక్‌, మాజీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -