Thursday, April 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమరోసారి టాప్‌మార్క్‌తో చరిత్ర సృష్టించిన నారాయణ

మరోసారి టాప్‌మార్క్‌తో చరిత్ర సృష్టించిన నారాయణ

- Advertisement -

– తెలంగాణ టెన్త్‌ ఫలితాల్లో 597/600 సాధించిన నలుగురులో ఒకరు ఈ విద్యాసంస్థ విద్యార్థే
– జంటనగరాల్లోనూ టాప్‌ మార్క్‌..
– రాష్ట్రంలో 530.26 సగటు మార్కులు సాధించిన ఘనత ఈ సంస్థదే..
– 84 బ్రాంచీలలో 100పాస్‌ పర్సంటేజ్‌
– అన్ని సబ్జెక్టుల్లో ‘ఎ’ గ్రేడ్స్‌ సాధించిన 44,222 మంది
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ ఎస్‌ఎస్‌సీ-2026 ఫలితాల్లో నారాయణ హవా కొనసాగింది. ఎప్పటిలాగే నారాయణ విద్యార్థులు తమ ప్రతిభతో పైచేయి సాధించారు. స్టేట్‌లోనే టాప్‌ మార్కులతో నారాయణ విద్యార్థి మేఘాన్స్‌ శ్రీరామ్‌ (హెచ్‌.టి.నెం: 2623109445) 597 మార్కులతో చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా శోభిత కొప్పరపు (హెచ్‌.టి.నెం: 2621106169) 596 మార్కులు, మన్నే చంద్రహాస్‌ (హెచ్‌.టి.నెం: 2621106193) 596 మార్కులు, తూముల నిశ్చరు ప్రణవ్‌ (హెచ్‌.టి.నెం: 2621106237) 596 మార్కులు, కిలారి అలిత్‌ (హెచ్‌.టి.నెం: 2623109391) 596 మంది టాప్‌ మార్కులతో సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించారు. 595 మార్కులు 6 గురు విద్యార్థులు, 594 మార్కులు 8 మంది విద్యార్థులు, 593 మార్కులు 8 మంది విద్యార్థులు, 592 మార్కులు 19 మంది విద్యార్థులు, 591 మార్కులు 30 మంది విద్యార్థులు, 590 మార్కులు 40 మంది విద్యార్థులు సాధించగా, 590 ఆపైన 116 మంది విద్యార్థులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ, నారాయణ విద్యాసంస్థల కోర్‌ కమిటీ సభ్యురాలు రమా నారాయణ తెలిపారు. మ్యాథ్స్‌ సబ్జెక్టులో ఎ గ్రేడులు సాధించిన విద్యార్థులు 7,334, సైన్స్‌ సబ్జెక్టులో ఎ గ్రేడులు సాధించిన విద్యార్థులు 7,558, సోషల్‌ సబ్జెక్టులో ఎ గ్రేడులు సాధించిన విద్యార్థులు 8,022, ఇంగ్లీష్‌ సబ్జెక్టులో ఎ గ్రేడ్లు సాధించిన విద్యార్థులు 7,475, ఫస్ట్‌లాంగ్వేజ్‌లో ఎ గ్రేడ్లు సాధించిన విద్యార్థులు 6,574, సెకండ్‌ లాంగ్వేజ్‌లో ఎ గ్రేడులు సాధించిన విద్యార్థులు 7,259 మొత్తంగా ‘ఎ’ గ్రేడులు 44,222 విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. నారాయణ మొత్తం విద్యార్థుల సగటు మార్కు 530.26 గా ఉందన్నారు. తెలంగాణలో 530.26 సగటు మార్కు సాధించిన ఏకైక విద్యాసంస్థ నారాయణ మాత్రమే అని పేర్కొన్నారు. తెలంగాణలో 8,935 మంది విద్యార్థులలో 99.66 శాతం ఉత్తీర్ణత సాధించజేసిన ఘనత ఒక్క నారాయణకే దక్కిందన్నారు. 80 బ్రాంచీల్లో 100 శాతం పాస్‌ పర్సంటేజ్‌ సాధించినట్టు తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను తమ రోజు వారి సిలబస్‌లో భాగంగా బోధించటం ద్వారా నారాయణ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. నారాయణ సీపీ-స్పార్క్‌, ఒలింపియాడ్‌, ఈ-టెక్నో, మెడిస్పార్క్‌ ప్రోగ్రామ్స్‌తో బోధన చేయటం కారణంగానే ఘన విజయాలను కైవసం చేసుకున్నట్టు తెలిపారు.

అదే విధంగా గ్రేడ్‌ పాయింట్స్‌ అయినా లేక మార్కులైనా పదవ తరగతి ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎల్లప్పుడూ నారాయణే నెం.1 స్థానంలో నిలుస్తుందని నారాయణ స్కూల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సింధూర నారాయణ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, పటిష్టమైన అకడమిక్‌ ప్రోగ్రామ్స్‌, ప్రధాన సబ్జెక్టులపై స్ట్రాంగ్‌ ఫౌండేషన్‌, సబ్జెక్టులలో కాన్సెప్టులను ఇట్టే అర్థం చేసుకునేలా టీచింగ్‌ మెథడాలజీ నారాయణ విజయానికి అసలైన రహస్యాలని పేర్కొన్నారు. కోర్‌ కమిటీ సభ్యురాలు రమా నారాయణ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఎగ్జామ్స్‌ అన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున నారాయణ సంస్థ కూడా తన విద్యార్థుల కోసం స్కూల్‌ స్థాయి నుంచే ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌పై శిక్షణ అందిం చేందుకు ఎన్‌-లెర్న్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశ పెట్టినట్టు తెలిపారు. ఈ ప్లాట్‌ ఫామ్‌లో ముఖ్యం గా అంశాలవారీగా, అధ్యాయాల వారీగా పాఠ్యాం శాలపై పట్టు కోసం పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అలాగే పరీక్ష సమయంలో ఆందోళనకు గురయ్యే విద్యార్థుల కోసం ‘దిశ’ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఏదేని కారణం చేత విద్యార్థులు ఒత్తిడికి గురై ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చినట్టయితే వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్‌ నిర్వహించి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించటమే దిశ ప్రోగ్రామ్‌ లక్ష్యమని తెలిపారు. నారాయణ డైరెక్టర్‌ శరణి నారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభ మెరుగు పరిచేందుకు నారాయణ అడ్వాన్స్డ్‌గా ఆలోచిస్తుం దన్నారు. పక్కా ప్లానింగ్‌తో బోర్డ్‌ పరీక్షలతో పాటు ఒలింపియాడ్‌, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయటం నారాయణ ప్రత్యేకత అని తెలియజేశారు. డైలీ ప్రాక్టీస్‌ టెస్ట్‌లు (డీ.పీ.టీ) పార్ట్‌ టెస్ట్స్‌, సిలబస్‌ బేస్డ్‌ టెస్ట్స్‌, ప్రత్యేకమైన కాలిగ్రఫీ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డిస్ట్రెస్సివ్‌ ఎగ్జామ్స్‌పై ప్రత్యేక వర్క్‌షాప్స్‌ నిర్వహ ణతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నామ న్నారు. ఇంతటి అనితర సాధ్యమైన విజయానికి కారణమైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.పునీత్‌ ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -