Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా శ్రీలక్ష్మీ నారాయణ రథోత్సవాలు

ఘనంగా శ్రీలక్ష్మీ నారాయణ రథోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాలు అంగరంగ వైభోగంగా జరిగాయి. ఇందులో భాగంగా రథోత్సవాలకు వచ్చే భక్తలకు అన్నదాన దాతగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కుస్తీ పోటీల దాత మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే, భారీ రథానికి లైటింగ్ దాతగ మాజీ ఎమ్మెల్యే ఎస్ గంగారం ముందుకు వచ్చి సహకరంచారు. రథోత్సవాలను విజయవంతం చేయడానికి దాతలు ముందుకు రావడం గొప్ప పరిణామమని ఆలయాధికారులు అన్నారు. భారీ రథాన్ని రథం గల్లి లక్ష్మీనారాయణ మందిరం నుండి పాత బస్టాండ్ లోని హనుమాన్ ఆంజనేయ స్వామి ఆలయానికి ఊరేగింపుగా శుక్రవారం రాత్రి బయలుదేరారు. శనివారం సాయంత్రం కుస్తీ పోటీలు, మహా అన్నదానం గ్రామంలో జాతర కొనసాగనున్నాయి. ఈ రథోత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు చెందిన జనాలు వారి సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ బందోబస్తు మధ్య రథోత్సవాలు జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -