నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ అశోక్ కుమార్ అన్నారు.10వ తరగతి ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం సాధించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని కటకం కావ్య శ్రీ ని సన్మానించి మాట్లాడారు.ఈ మేరకు కార్పొరేట్ స్కూళ్లలాగా కాకుండా,ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య,అమ్మలాంటి శిక్షణ, నాన్నలాంటి రక్షణ ఉందని,స్నేహపూర్వక బోధనతో విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేయడం జరుగుతుందన్నారు.పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు,ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులను సద్వినియోగం చేసుకుని,మట్టిలో మాణిక్యాలుగా నిలుస్తూ తమ తల్లిదండ్రుల కలలను నిజం చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బోయిని లింగయ్య,విద్యార్థిని తల్లిదండ్రులు కటకం వెంకన్న, శోభ,ప్రధానోపాధ్యాయురాలు కవిత,ఉపాధ్యాయ బృందం అంబేద్కర్,కృష్ణయ్య,రుక్మిణి,తదితరులు పాల్గొన్నారు.
పదిలో మెరిసిన ప్రభుత్వ పాఠశాల ఆణిముత్యం కావ్య శ్రీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



