Wednesday, May 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రముఖ నిర్మాత

ప్రముఖ నిర్మాత

- Advertisement -

ఆర్‌బీ చౌదరి దుర్మరణం
హైదరాబాద్‌
: ప్రముఖ చలన చిత్ర నిర్మాత ఆర్‌బీ చౌదరి (76) దుర్మరణం చెందారు. రాజస్థాన్‌లోని ఉదరుపుర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తమిళ, తెలుగు, మలయాళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ‘రంగం’ ఫేమ్‌ హీరో జీవా.. ఆర్‌బీ చౌదరి తనయుడే. మరో తనయుడు రమేశ్‌ ‘విద్యార్థి’ చిత్రంలో హీరోగా నటించారు. వీరితోపాటు మరో ఇద్దరు కుమారులున్నారు.రాజస్థానీ అయిన ఆర్‌బీ చౌదరి 1950లో మద్రాసులో జన్మించారు. పూర్తి పేరు రతన్‌లాల్‌ భగత్‌రామ్‌ చౌదరి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -