- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య గురువారం మండలంలోని కొయ్యుర్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన, రంగుమారిన, మొలికెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు చూడాలన్నారు.
- Advertisement -



