కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
నవతెలంగాణ-రాయికల్
మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఇప్పటికే కోత పూర్తిచేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం వర్షానికి తడవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల ధాన్యపు కుప్పలపై తాత్కాలిక టార్పాలిన్‌లు ఏర్పాటు చేసినప్పటికీ భారీ గాలులతో పాటు వర్షం కురవడంతో ధాన్యం తడిసిపోయింది. మండలంలో ఈ యాసంగి సీజన్‌లో సుమారుగా మొక్కజొన్న 7,350 ఎకరాల్లో,వరి 17,650 ఎకరాల్లో సాగు చేశారు.ఇప్పటికే సగం వరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది.మండల వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 17 వేల క్వింటాళ్ల వరిధాన్యాన్ని తూకం వేసి గోదాములకు తరలించగా,మరో 11 వేల క్వింటాళ్లు తరలింపుకు సిద్ధంగా ఉన్నాయి. అదనంగా సుమారు 5 వేల క్వింటాళ్ల ధాన్యం తూకం వేసి కేంద్రాల వద్దనే నిల్వ ఉంది.
అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడవడంతో రైతులు నష్టపోతామేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే ఆరబెట్టి, త్వరితగతిన గోదాములకు తరలించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.రాయికల్ మార్కెట్ యార్డ్ వద్ద సుమారు 6,000 క్వింటాళ్ల మక్కలు నిల్వ ఉన్నాయి.
ఫాక్స్ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నిల్వలు:
కొత్తపేట-3,000 క్వింటాళ్లు
మైతాపూర్-4,000
మూటపల్లి-2,500
రాయికల్ (మార్కెట్ యార్డ్)-2,500
రామాజిపేట-6,000
రాయికల్ (శివాజీ నగర్)-3,000
భూపతిపూర్-6,500
ఒడ్డెలింగాపూర్-3,000
బోర్నపల్లి-2,000
ధర్మాజీపేట్-6,500
అల్లీపూర్-4,000
అయోధ్య-7,000
సింగర్‌రావుపేట-3,000
శ్రీరామ్‌నగర్-3,000
ఇటిక్యాల (పాక్స్)-3,000
ఉప్పుమడుగు-4,000
వీరాపూర్-3,500
కుమ్మరిపల్లి-2,700
రాజనగర్-2,400
ఆలూరు-2,700 క్వింటాళ్లు నిల్వ ఉన్నాయి.
ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు:
ఆలియానాయక్ తండా-320క్వింటాళ్లు
ఇటిక్యాల-246
తాట్లవాయి-92
క్వింటాళ్ల వరి ధాన్యం నిల్వలు ఉన్నాయి.



