- Advertisement -
నవతెలంగాణ-అచ్చంపేట
మండలంలోని బుడ్డ తాండలో శనివారం సాయంత్రం పిడుగు పడి రెండు కాడెద్దులు మృత్యువాత పడ్డాయి. అకాల వర్షం సమయంలో వ్యవసాయ పొలంలో చెట్టుకు కట్టేసి ఉన్న పశువులపై ఒక్కసారిగా పిడుగు పడటంతో మోత్య అనే రైతు కు చెందిన కడెద్దులు అక్కడికక్కడే మృత్యువాత చెందాయి. వ్యవసాయం కోసం ఇటీవలే రూ.1.10 లక్షల వ్యయంతో రెండు పశువులను కొనుగోలు చేసినట్లు రైతు తెలిపాడు. అప్పు చేసి పశువులను కొనుగోలు చేశానని, అనుకోకుండా పిడుగు పడి అవి మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇక వ్యవసాయం ఎలా చేయాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని రైతు మోత్య వేడుకున్నాడు.
- Advertisement -



