Sunday, May 24, 2026
E-PAPER
Homeహెల్త్నీరు ఎంత తాగాలి?

నీరు ఎంత తాగాలి?

- Advertisement -

శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన ద్రవం నీరు. ఇది కేవలం నీరు మాత్రమే కాదు, ఒక మెడిసిన్‌ లాంటిది. శరీరంలో పోషకాల శోషణకు నీరు ఎంతో అవసరం. నీటి శాతం తగ్గితే బీపీ, ఇన్సోమ్నియా (నిద్రలేమి), కిడ్నీలో రాళ్లు, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు (మలబద్ధకం వంటివి) వచ్చే అవకాశం ఉంది.
నీటిని ఎలా తాగాలి? : బ నీటిని ఎప్పుడూ హడావుడిగా తాగకూడదు, సిప్‌ చేస్తూ నెమ్మదిగా తాగాలి. బ కూర్చుని తాగడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. బ చప్పరిస్తూ తాగడం వల్ల లాలాజలంతో కలిసి నీరు పొట్టలోకి వెళ్లి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. బ ఆహారం తిన్న వెంటనే ఎక్కువగా నీరు తాగకూడదు. అలా తాగడం వల్ల గ్యాస్ట్రిక్‌ జ్యూసెస్‌ పలుచబడి జీర్ణక్రియ మందగిస్తుంది. బ ఉదయం పూట సుమారు అరలీటర్‌ నీరు తాగడం మంచిది. బ గోరువెచ్చని నీరు తాగడం వల్ల పైల్స్‌, కిడ్నీలో రాళ్లు, మలబద్ధకం తగ్గుతాయి. అయితే అసిడిటీ ఉన్నవారు వేడి నీరు తాగకూడదు.
జాగ్రత్తలు : ప్లాస్టిక్‌ వాడద్దు: ప్లాస్టిక్‌ బాటిల్స్‌ లేదా కంటైనర్స్‌ వాడకూడదు. ప్లాస్టిక్‌ పెట్రోలియం ప్రొడక్ట్‌ కాబట్టి ఇది క్యాన్సర్‌ కారకం కావచ్చు.
సరైన పాత్రలు: గాజు, స్టీల్‌ లేదా రాగి పాత్రలను వాడుకోవచ్చు.
రాగి పాత్రల వాడకం: రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచి తాగవచ్చు, కానీ మరీ మోతాదు మించి తాగకూడదు. కూల్‌ వాటర్‌కు బదులుగా సాధారణ నీరు తాగడం శ్రేయస్కరం.
ఎంత నీరు తాగాలి? : శారీరక శ్రమను బట్టి: బాగా శారీరక శ్రమ చేసేవారు లేదా ఎండలో తిరిగేవారు రోజుకు 4 లీటర్ల నీరు తాగాలి.
ద్రవ పదార్థాలు తీసుకునే వారు: మజ్జిగ లేదా ఇతర జ్యూసులు తీసుకునేవారు అదనంగా ఒకటి రెండు లీటర్ల నీరు తాగవచ్చు.
పరిమితులు: నీరు తక్కువగా తాగడం వల్ల వాసోప్రెసిన్‌ (ఙaరశీజూతీవరరఱఅ) ఉత్పత్తి తగ్గుతుంది. అలాగని 5 లీటర్ల కంటే ఎక్కువ తాగడం కూడా మంచిది కాదు.
సూచన: మూత్రం రంగును (యల్లో కలర్‌) గమనిస్తూ నీటి మోతాదును సర్దుబాటు చేసుకోవాలి. వాతావరణ పరిస్థితులను బట్టి మోతాదును మారుస్తూ ఉండాలి.

వాణి అయోధ్య
క్లినికల్‌ డైట్‌ కన్సల్టంట్‌
9959361180

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -