నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో ఆ గ్రామస్తుల ఐక్యమత్యమే గత మూడు సంవత్సరాల కాలంగా చేపడుతున్న అఖండ హరినామ సప్త విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో అఖండ హరినామ సప్త ఐదో రోజుకు చేరిందని, సప్త ఈనెల నాలుగో తేదీ బుధవారంతో ముగుస్తుందని గ్రామ పెద్దలు తెలిపారు. ఏడు రోజులపాటు జరిగే అఖండ హరినామ సప్తకు సచిన్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు భజన కీర్తనలు జరుగుతున్నాయని, ముగింపు రోజున పెద్ద ఎత్తున గ్రామస్తులంతా ప్రత్యేక పూజలు మహా అన్నదానంలో పాల్గొంటారని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోని గ్రామ పెద్దలు యువకులు మహిళలు చిన్నారులు ఈ అఖండ హరినామ సప్తకు మూడు సంవత్సరాలుగా ఐక్యమత్యంగా విజయవంతం కావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సప్త మూలంగా గ్రామ ప్రజలు భక్తి మార్గంలో నడుచుకోవడానికి ఎంతో కృషి జరుగుతుందని గ్రామస్తులు అంటున్నారు.
అంతాపూర్ లో మూడేండ్లుగా అఖండ హరినామ సప్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



