Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం టియూఎఫ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి భూపాలపల్లి జిల్లా ఫోరం అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్, అధికార ప్రతినిధి బోయిని రాజయ్య యాదవ్‌ల నేతృత్వంలో ఉద్యమకారులు భారీగా తరలివెళ్లారు.ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఉద్యమకారుల కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డిలు మాట్లాడిన అంశాలను జిల్లా ప్రతినిధులు గట్టయ్య యాదవ్, ప్రభాకర్ మీడియాకు వివరించారు.

రాష్ట్రంలో తొలి, మలిదశ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, కాబట్టి ఎవరూ అధైర్యపడొద్దని, ప్రతి ఒక్క ఉద్యమకారుడిని ప్రభుత్వం గుర్తిస్తుందని అతిథులు హామీ ఇచ్చారన్నారు. ఉద్యమకారుల హామీల అమలుకు కమిటీ వేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి మందల రవీందర్ రెడ్డి, మహదేవపూర్ మండల అధ్యక్షులు అక్రమొధ్ధిన్, అంకారి ప్రభాకర్, తొలిదశ ఉద్యమకారులు వామన్ రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సాంబలక్ష్మి, రాజేశ్వరి, తదితర ఉద్యమ కారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -