Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ పాఠశాలలో విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

పూర్వ పాఠశాలలో విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ – వర్ధన్నపేట : వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ వద్ద గతంలో ఉన్న విశ్వశాంతి పూర్వ పాఠశాల ఆవరణలో 2010- 11 సంవత్సరం పూర్వ విద్యార్థుల బ్యాచ్ 15వసంతాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు.గురువులకు ఘన సన్మానం, చేసి చిన్ననాటి జ్ఞాపకాల గుర్తు తెచ్చుకున్నారు. 2010–2011 పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి, జ్ఞాపికలతో సత్కరించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
కళ్లెదుట కదిలిన చిన్ననాటి జ్ఞాపకాలు
సుదీర్ఘ కాలం తర్వాత ఒకరినొకరు కలుసుకున్న చిన్ననాటి మిత్రులు ఆలింగనం చేసుకుని ఆనందబాష్పాలు రాల్చారు. తాము చదువుకున్న తరగతి గదులు, ఆడుకున్న ఆట స్థలం, పాఠశాల ప్రాంగణాన్ని చూస్తూ పాత స్మృతులను నెమరువేసుకున్నారు. నాటి రోజుల్లో చేసిన అల్లరి, స్కూల్ జ్ఞాపకాలను పంచుకుంటూ కాసేపు మురిసిపోయారు. ఫోటోలతో కూడిన హిస్టరీ బోర్డులు అందరినీ ఆకట్టుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -