నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రైల్వే రంగాన్ని ప్రయివేటీకరణ వ్యతిరేకించాలని రైల్వే రంగం జిల్లా నాయకులు దాసరి పాండు అన్నారు. శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ముందు రైల్వే రంగాన్ని ప్రయివేటీకరణ చేయడం ఆపాలని ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి కార్మిక వర్గం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు శక్తులకు సంపదను సృష్టించే ప్రభుత్వ రంగాలు రైల్వే, ఎల్ఐసి, పోస్టల్, టెలికాం లాంటి అప్పజెప్పడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. బ్రిటిష్ వారి హయాంలోనే అనేక పోరాటాలు చేసి సాధించుకున్న ఈ రంగాలను ప్రయివేటీకరణ చేయడం వల్ల పేద మధ్యతరగతి కార్మిక వర్గానికి అందుబాటులో లేకుంటా పోతున్నాయని ఆవేదన చెందారు.
కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు కోడ్ లుగా చేయడం వల్ల ఉద్యోగ కార్మికులను బానిసలుగా యాజమాన్యాలకు శ్రమ దోపిడీ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా నెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గం పాల్గొనాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ, టౌన్ కన్వీనర్ గంధ మల్ల మాతయ్య, నాయకులు నాయకులు గురువయ్య, ఎల్లేష్, కోటేష్, గురువయ్య, రత్నం కోటేష్ లక్ష్మీ లు పాల్గొన్నారు.


