వాషింగ్టన్ : లోహాల విధానానికి సంబంధించిన సెక్షన్ 232ను సవరించడం ద్వారా కొన్ని ఎంపిక చేసిన వ్యవసాయ, పారిశ్రామిక పరికరా లపై సుంకాలను తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో దిగుమతి చేసుకుంటున్న యంత్రా లలో అమెరికాలో తయారైన ఉక్కు, అల్యూమినియంను వినియోగించే తయారీ దారులకు ప్రోత్సాహకా లను కూడా ప్రవేశపెట్టారు. ఈ నెల 1న అధ్యక్షభవనం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం కంబైన్లు, హార్వెస్టర్లు వంటి వ్యవసాయ పరికరాలపై విధిస్తున్న సుంకాలను వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకూ పదిహేను శాతానికి తగ్గించారు. ఇవి ప్రస్తుతం ఇరవై ఐదు శాతంగా ఉన్నాయి. అమెరికా వాణిజ్య ఒప్పం దాల పరిధిలోకి వచ్చే దేశాల నుంచి దిగుమతి చేసుకునే బుల్డోజర్లు, ఫోర్క్ లిఫ్టులపై విధిస్తున్న సుంకాన్ని కూడా పదిహేను శాతానికి తగ్గించారు. 1962 నాటి వాణిజ్య విస్తరణ చట్టం లోని సెక్షన్ 232 కింద అమెరికా లోహ ఉత్పత్తిదారులకు కల్పిస్తున్న రక్షణలను కొనసాగిస్తూనే దేశీయ తయారీ రంగం, వ్యవసాయం, పారిశ్రామిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడమే ఈ మార్పుల ఉద్దేశమని ట్రంప్ తెలిపారు.
వ్యవసాయ -పారిశ్రామిక పరికరాలపై సుంకాలు తగ్గించిన ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



