Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ పిలుపు బుధవారం తహసిల్దార్ కార్యాలయం ముందు ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ అధ్యక్షులు ఎస్. సురేష్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను, స్వామినాథన్ కమీషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. పార్లమెంటులో రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల చట్టాన్ని చేయాలని, రైతులందరికీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సబ్సిడీపై సరఫరా చేయాలని కోరారు. రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని, రైతులందరికీ ఎకరానా రూ. రెండు లక్షల రుణాలు ఇవ్వాలన్నారు. పోడు కొట్టుకొని వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని, రైతులకు అన్ని రకాల పనిముట్లను సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం కమ్మర్ పల్లి ఏరియా అధ్యక్షులు బాలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.కిషన్, లింబ నాయక్, లింబన్న, రమేష్, మలావత్ లింబన్న, స్వప్న, శిరీష, నర్సు, లక్ష్మి గౌరీ,  లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -