Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల పోలింగ్ కి ఉపయోగిస్తున్న విద్యసంస్థలకు సెలవు

ఎన్నికల పోలింగ్ కి ఉపయోగిస్తున్న విద్యసంస్థలకు సెలవు

- Advertisement -

జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి వినియోగించు కుంటున్న అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు, ఇతర పబ్లిక్ బిల్డింగ్స్ అన్నింటికీ పోలింగ్ ముందు రోజైన ఫిబ్రవరి 10, పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11 న స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఒక్క ప్రకటన లో ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 11న సూర్యాపేట మున్సిపాలిటీ తో పాటు తిరుమలగిరి, కోదాడ హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ మున్సిపాలిటీలలో పోలింగ్ నిర్వహణకై వినియోగించుకుంటున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు, ఇతర భవనాలకు పోలింగ్ ముందు రోజు ,పోలింగ్ రోజున రెండు రోజులు స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -