నవతెలంగాణ-హైదరాబాద్: ఇందన భద్రను పూర్తిగా వదిలేశారని, మన దేశం చమురు ఎవరి నుంచి కొనుగోలు చేయాలన్నిది అమెరికా నిర్ణయిస్తోందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ లోక్ సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశంలోని 1.4 బిలియన్ల మంది ప్రజలు కొత్త సవాల్‌ను ఎదుర్కొంటున్నారన్నారు. బడ్జెట్‌లో ముఖ్యమైన విషయాలకు కేటాయింపులే లేవని చెప్పారు. డేటాకు సంబంధించింది ఏమీలేదన్నారు.
యూఎస్ డీఎల్ జరిగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.డాలర్ విలువ బలంగా ఉండాలంటే మన డేటా అమెరికాకు అవసరం అన్నారు. ప్రపంచ దేశాలు యుద్ధాల వైపు వెళ్తున్నాయని అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని చైనా, రష్యా ప్రశ్నిస్తున్నాయన్నారు. భారత్ ఎగుమతులపై 18శాతం సుంకాలు విధించి యూఎస్ రైతులను గౌరవించారని, కానీ పీఎం మోడీ సున్నా టారిప్‌లు విధించి భారతీయ రైతులను అవమానించరిన మండిపడ్డారు.



