Wednesday, February 11, 2026
E-PAPER
HomeఆటలుT20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం..డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్

T20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం..డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది. ఏకంగా రెండు సూప‌ర్ ఓవ‌ర్లు నిర్వ‌హించారు. గుజరాత్ అహ్మ‌దాబాద్ స్టేడియం వేదిక‌గా ద‌క్ష‌ణాఫ్రికా వ‌ర్సెస్ ఆప్ఘానిస్థాన్ టీం మ‌ధ్య ఆట ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన‌ సౌతాఫ్రికా 20 ఓవ‌ర్ల‌కు గాను 6 వికెట్లు కోల్పోయి 187 ప‌రుగులు చేసింది. డికాక్(59), రిక్ల‌ల్ ట‌న్ (61) అర్ధ సెంచ‌రీల‌తో మెరువ‌గా, బ్రేవీస్ 23, మిల్ల‌ర్ 20 ప‌రుగుల‌తో రాణించారు. అప్ఘాన్ బౌల‌ర్లు ఓమ‌రాజ్ 3 వికెట్లు, ర‌షీద్ ఖాన్ 2, ఫారూఖీ ఒక వికెట్ తీశారు.

ఆ త‌రాత్వ ల‌క్ష్య చేధ‌న‌కు దిగిన అప్ఘాన్ ఓపెనింగ్‌లో శుభారంభం ల‌భించినా..చివ‌ర్లో వ‌రుస‌గా వికెట్లు కోల్పోవ‌డంతో చేధ‌న‌లో త‌డ‌బడింది. ఓపెన‌ర్ల గుర్బాజ్ 42 బంతుల్లో 84 (4 ఫోర్లు, 7 సిక్స్) పరుగులతో అప్ఘాన్ విజయాన్ని చేరువ చేసినా..ఫలితం ద‌క్క‌లేదు. లాస్ట్ రెండు ఓవ‌ర్లో 12 బాల్స్‌లో 24 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా..కెప్ట‌న్ ర‌షీద్ ఖాన్(20) ధాటిగా ఆడాడు. ర‌షీద్ అవుట్ తో క్రీజులోకి వ‌చ్చిన నూర్ (8 బంతుల్లో 14 ర‌న్స్) మెరుపు బ్యాటింగ్ తో రాణించినా…మ్యాచ్ డ్రా అయింది.

మ్యాచ్ టైతో రెండు జ‌ట్ల మ‌ధ్య సూప‌ర్ ఓవ‌ర్ అనివార్య‌మైంది. అప్ఘాన్ ఆరు బంతుల్లో 17 ప‌రుగులు చేయ‌గా.. ఆ త‌ర్వాత‌ ద‌క్ష‌ణాఫ్రికా బ్యాట‌ర్లు కూడా వికెట్ కోల్పోయి 17 ర‌న్స్ చేయ‌డంతో సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అయింది. దీంతో ఎంపైర్లు ఇరు జ‌ట్లు మ‌ధ్య రెండో సూప‌ర్ ఓవ‌ర్ నిర్వ‌హించారు. ఈ సారి మొద‌ట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా..6 బంతుల్లో 23 ప‌రుగులు చేసింది. అయితే టార్గెట్ చేజింగ్‌లో ఆప్ఘాన్ టీం తీవ్ర ఒత్తిడికి గురైంది. రెండో బంతికే వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన గుర్బాజ్.. కేశ‌వ్ మ‌హారాజ్ బౌలింగ్ లో వ‌రుస‌గా మూడు సిక్స్ లు బాదాడు. లాస్ట్ బాల్‌కి క్యాచ్ ఇచ్చాడు. ఉత్కంఠగా సాగిన రెండో సూప‌ర్ ఓవ‌ర్లో సౌతాఫ్రికా విక్ట‌రీ సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -