కార్మిక మహా ప్రదర్శనలో బొట్ల చక్రపాణి డిమాండ్
నవతెలంగాణ – పరకాల
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే విధంగా రూపొందించిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, విబిజి రామ్ జీ బిల్లును రద్దు చేయాలనీ సిఐటియు జిల్లా కోశాధికారి బోట్ల చక్రపాణి కేంద్రం ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా హుజురాబాద్ రోడ్డులోని పెట్రోల్ పంపు నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా అమరధామం వరకు డప్పు చప్పులతో కార్మిక మహాప్రదర్శన నిర్వహించారు.
అనంతరం జరిగిన సభకు ఏ ఐ సి సి టి యు జిల్లా అధ్యక్షులు బొట్ల ప్రభాకర్ అధ్యక్షత వహించగా చక్రపాణి పాల్గొని మాట్లాడుతూ.. కార్మికులు దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్ శక్తులకు మేలు చేకూరేలా కేంద్రం ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తెచ్చారని వీటి ఫలితంగా కార్మికులు యజమానులకు పనిచేయాల్సి వస్తుందని ఆయన మండిపడ్డారు. వీటి ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తూ, ‘హైర్ అండ్ ఫైర్’ (నియమించు-తొలగించు) పద్ధతిని చట్టబద్ధం చేయడం, 12 గంటల పని పెంపుదల, సమ్మె చేసే హక్కు కనీస వేతనం ఉద్యోగ భద్రత లాంటి చట్టబద్ధ హక్కులు లేకుండా పనిచేయాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని 50 సంవత్సరాల పైబడిన వారికి తొమ్మిది వేల పెన్షన్ ఇవ్వాలని తదితర డిమాండ్లుతో ఈ సమ్మెలో విద్యుత్ సవరణ చట్టం-2025, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసిలో 100 శాతం విదేశీ పెట్టుబడుల అనుమతి వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని అయన డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలను కేంద్రం హస్తగతం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ఈ సమ్మెలో సుమారు 40 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి నాయకులు లంకదాసరి అశోక్ వివిధ సంఘాల నాయకులు లంకదాసర అశోక్ నరసింహులు, బచ్చు ఆదాం సాంబయ్య, రమేష్, మోహన్, పసుల సారయ్య పైడి ఉపేందర్ రాజేందర్ సారంగపాణి సుధాకర్ కుమారు కుమార్ ప్రమోద్ కోటయ్య పసుల సారయ్య వసంత కమల రాధా కుమారస్వామి తోపాటు 300 మంది కార్మికులు పాల్గొన్నారు.



