Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవణికించిన వాన

వణికించిన వాన

- Advertisement -

మల్కాజిగిరిలో 13.35 సెంటీమీటర్ల వాన
రాష్ట్ర వ్యాప్తంగా 243 ప్రాంతాల్లో…
ఒక్క హైదరాబాద్‌‌లోనే 140 చోట్ల వర్షం
మూడ్రోజులు జిల్లాలకు భారీ వర్ష సూచన

‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నిన్నమొన్నటి వరకూ భానుడు తన ప్రతాపాన్ని చూపగా మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్‌ ‌మహానగరాన్ని వణికించింది. నైరుతి రుతుపవనాల వ్యాప్తితో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 :30 గంటల వరకు రాష్ట్రంలో 246 ప్రాంతాల్లో వర్షపాతం నమోదుకాగా అందులో ఒక్క హైదరాబాద్‌ ‌మహానగరం పరిధిలోనే 140 చోట్ల వాన పడింది. మల్కాజిగిరిలో అత్యధికంగా 13.35 సెంటీమీటర్ల అతిభారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు పాటు వర్షాలు పడే సూచనలున్నాయి. బుధవారం నాడు వికారాబాద్‌, మహబూబ్‌‌ నగర్‌, జోగులాంబ గద్వాల, నారాయణ పేట జిల్లాల్లో పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందనీ, గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో వచ్చే 24 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పలు ప్రాంతాల్లో పడే సూచనలు బలంగా ఉన్నాయి.

​అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు 
(మంగళవారం రాత్రి 10:30 వరకు)
మల్కాజిగిరి(మేడ్చల్‌మల్కాజిగిరి) 13.35 సెంటీమీటర్లు
బన్సీలాల్‌‌పేట(‌హైదరాబాద్‌) 8.75 సెంటీమీటర్లు
హిమాయత్‌‌నగర్‌(‌హైదరాబాద్‌) 7.98 సెంటీమీటర్లు
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం(హైదరాబాద్‌)7.85 సెంటీమీటర్లు
ఆర్టీసీఎంప్లాయీస్‌భవన్‌(‌హైదరాబాద్‌) 7.80 సెంటీమీటర్లు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -