Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనాడు ఓట్‌ ‌చోరీ..నేడు సీట్‌ ‌చోరీ

నాడు ఓట్‌ ‌చోరీ..నేడు సీట్‌ ‌చోరీ

- Advertisement -

మీనాక్షి నటరాజన్ నామినేషన్ 
తిరస్కరణపై రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
స్పెషల్‌ ఇంటెన్సివ్‌ ‌రివిజన్‌ (‌సర్‌) ‌పేరుతో నాడు ఓట్లను చోరి చేసిన బీజేపీ… నేడు కాంగ్రెస్‌ ‌నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించి సీట్‌ ‌చోరికి పాల్పడిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌ ‌వేధికగా విమర్శలు గుప్పించారు. ‘మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ కుట్ర. ఓట్ చోరీ తర్వాత… ఇప్పుడు బీజేపీ సీట్ చోరీకి పాల్పడుతోంది. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. జైరాం రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్ ను కలిసేందుకు వెళితే అడ్డుకున్నారు. గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. ప్రజల గొంతులను అణచివేయడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -