ఆస్పత్రి డాక్టర్ క్రిస్టినా..
నవతెలంగాణ – డిచ్ పల్లి
దోమల వల్ల కలిగే వ్యాధులైన మలేరియా, డెంగ్యూ,చికున్ గున్యా, ఫైలేరియా మెదడువాపు లాంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇందల్ వాయి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ క్రిస్టినా పేర్కొన్నారు. గురువారం డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి గ్రామంలోని తెలంగాణ మహాత్మ జ్యోతిభాపులే గురుకుల పాఠశాల(బాలురు )లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం, సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని వైధ్యాధికారి డాక్టర్. క్రిస్టినా ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఈగల వ్యాప్తిని అరికట్టాలని ఈగల వలన డయేరియా, కలరా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని వివరించారు. పాఠశాల చుట్టూ వాతావరణన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ నరేష్ గౌడ్ సూచించారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తాజా ఆకుకూరలు కూరగాయలు గల ఆహారాన్ని తీసుకోవాలని ప్రతిరోజు పాలు, గుడ్లు ఖచ్చితంగా ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలని తెలిపారు.
బెల్లం పల్లీలు, మునగ ఆకులు, మునగ కాడలు, తీసుకోవా లనన్నారు. సాయంత్రం పాఠశాలలో ఇచ్చే ఉడకపెట్టిన పల్లీలు, బఠానీలు, శెనిగలు తినాలని వాటిలో బి. కాంప్లెక్స్ అధికంగా ఉంటుందని తెలిపారు. పండ్లు, ఆరెంజ్ లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి లో విటమిన్ డి లభిస్తుందని సూచించారు. పౌష్టికాహారాన్ని తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయని చెప్పారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల విద్యార్థులు మానసికంగా శారీరకంగా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు.



