Friday, June 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్య

ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్య

- Advertisement -

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు అర్హులైన ఉపాధ్యాయులచే మెరుగైన, నాణ్యమైన విద్య బోధన అందుతోందని మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాడిచెర్లలోని పలు వార్డుల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడారు బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని కోరారు. ప్రవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అనే నినాదంతోటి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని,ప్రైవేట్ పాఠశాలలకు పంపించి ఆర్థికంగా నష్టపోకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలున్నాయన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి అధిక సంఖ్యలో పిల్లలను నమోదు పెంచి మన గ్రామం మండల స్థాయిలో జిల్లా స్థాయిలో విద్యార్థుల నమోదులో ముందంజలో ఉండాలని తల్లిదండ్రులను కోరారు. శుక్రవారం బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించి వారి యొక్క బాల్యానికి అంతరాయం కలిగించకుండా ఉండాలని  తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గ్రామ సర్పంచ్, గ్రామంలో ఉన్న విద్యావేత్తలందరూ సైతం సహాయ సహకారాలు అందించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -