నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని జైన్ మందిర్ ఆవరణలో బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి గడ్డం సిద్ధులు తల్లి గడ్డం చెండమ్మ మూడవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నిరుపేద కుటుంబాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు,సామాజిక కార్యకర్తలు పాల్గొని చెండమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గ్రామంలోని నిరుపేదలు, వృద్ధులు, పలువురు కుటుంబాలకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా గడ్డం సిద్ధులు మాట్లాడుతూ తన తల్లి చెండమ్మ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తల్లి ఆశయాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాడ నాగరాజు, బెదరపోయిన శంకరయ్య, దాసరి ఆంజనేయులు, గుర్రాల బాలరాజు, మాటూరి నరసింహులు, డేగల ప్రభాకర్, మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య, ఆరె మల్లేష్ గౌడ్, ప్రొద్దుటూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తల్లి జ్ఞాపకార్థం నిరుపేదలకు అన్నదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



