ఇద్దరు కుకీలు మృతి
ఇంఫాల్ : మణిపూర్ లో బిజెపి తన స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీ తెగల మధ్య రాజేసిన విద్వేష జాఢ్యంతో హింసాకాండ కొనసాగుతూనేవుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని సాయుధ దుండగుల దాడిలో కుకీ తెగకు చెందిన ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు మహిళ. కామ్ జోంగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగినట్లు పోలీసులు శుక్రవారం నాడు వెల్లడించారు. భారత్-మయన్మార్ సరిహద్దులోని కామ్ జోంగ్ జిల్లా కులుత్ గ్రామంలో ఇద్దరు కుకీలు మరణించినట్లు ఇంఫాల్ ధృవీకరించారు. మరో ఇద్దరు గాయపడ్డారని అన్నారు. నాగా గ్రూప్ దాడికి పాల్పడినట్లు ఈస్టర్న్ కుకీ చీఫ్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. చర్చీ సహా ఏడు నివాసాలకు నిప్పుపెట్టారని, దీంతో ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. బంధీలుగా తీసుకువెళ్లిన ఆరుగురు నాగాలను హత్య చేశారన్న ఆరోపణలపై మే 13న సేనాపతి జిల్లాలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. సేనాపతి, కామ్ జోంగ్ రెండు జిల్లాలు కూడా నాగా ప్రాబల్యం ఉన్నవి. అయితే అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ప్రాంత ఆధిపత్యం కోసం సాయుధ కుకీ గ్రూప్, మరో కుకీ తీవ్రవాద గ్రూపుల మధ్య ఘర్షణ కొనసాగుతోందని ఈస్టర్న్ కమాండ్ నాగా విలేజ్ గార్డ్ ఆరోపించింది. దాడిచేసిన కుకీ గ్రూప్ లలో ఒకటి మయన్మార్ కు చెందినదని ఆ సంస్థ పేర్కొంది.
మణిపూర్ లో ఆగని హింసాకాండ
- Advertisement -
- Advertisement -



