Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రచార కరపత్రాన్ని విడుదల చేసిన ఎమ్మెల్యే తోట

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రచార కరపత్రాన్ని విడుదల చేసిన ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మద్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రచార కరపత్రాన్ని జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలు, కోర్సులు, విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి ప్రశంసించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. ఈ కరపత్రాల విడుదల కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్  సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉష సంతోష్ మేస్త్రి, మద్నూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బండి గోపి, నాయకులు దత్తు, పెద్ద ఎక్లార గ్రామ సర్పంచ్ మహేష్ కుమార్, నాయకులు అధ్యాపకులు, సిబ్బంది  ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -