Sunday, June 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ విధానాలే కారణం

ఇజ్రాయిల్‌ విధానాలే కారణం

- Advertisement -

సెటిలర్ల ఆగడాలపై ఐరాస స్వతంత్ర కమిషన్‌ నివేదిక
పాలస్తీనీయులపై మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపణ

న్యూయార్క్‌ : ఇజ్రాయిల్‌ దాష్టీకాల కారణంగా పాలస్తీనా పౌరులు ఉద్దేశపూర్వ కంగా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘ నలకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితికి చెందిన స్వతంత్ర అంతర్జాతీయ కమిషన్‌ (విచారణ) తన తాజా నివేదికలో తెలిపింది. తూర్పు జెరుసలేం, ఇజ్రాయిల్‌, ఆక్రమిత పాలస్తీనా భూభాగంపై ఈ కమిషన్‌ ఓ నివేదికను రూపొందించింది. పాలస్తీనా పౌరులు ఓ వైపు ఇజ్రాయిల్‌ సేనలు-సెటిలర్లు జరుపుతున్న క్రూరమైన హింసకు, మరోవైపు హమాస్‌కు మధ్య నలిగిపోతున్నారని ఆ నివేదిక తెలియజేసింది. ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌కు సమర్పించిన ఈ నివేదిక ప్రకారం… తూర్పు జెరుసలేం సహా వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిలీ సెటిలర్ల చర్యలకు ప్రాథమికంగా ఇజ్రాయిల్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే గాజాలో పాలస్తీనా మిలిటెంట్ల చర్యలకు హమాస్‌ అనుబంధ శక్తులు బాధ్యత వహించాలి.

కమిషన్‌ ఏం చెప్పిందంటే…
‘సెటిలర్ల చర్యలకు ఇజ్రాయిల్‌ విధానాలు మద్దతు ఇస్తున్నాయి. వాటికి ఉపకరిస్తున్నాయి. ఆ చర్యలకు వత్తాసు పలుకుతున్నాయి. వాటి ఫలితమే హింస. ఇజ్రాయిల్‌ నిరంతర దాడులు, గాజాలో పెద్ద ఎత్తున విధ్వంసం కారణంగా ఏర్పడిన శూన్యాన్ని హమాస్‌ అనుబంధ దళాలు తమకు అనుకూలంగా మార్చుకుంటు న్నాయి’ అని కమిషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాసన్‌ మురళీ ధర్‌ ఐరాస పత్రికా ప్రకటనలో తెలిపారు. పాలస్తీనా పౌరులను ఉద్దేశపూర్వకంగా బాధిం చడం ఆందోళన కలిగించే విషయమని మురళీ ధర్‌ చెప్పారు. కాగా పాలస్తీనా ప్రజలపై సెటిలర్ల దాడులు పెరుగుతూనే ఉన్నాయని నివేదిక వేలెత్తి చూపింది. గత సంవత్సరం కనీసం ఏడు గురు పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోగా 832 మంది గాయపడ్డారు. 2024తో పోలిస్తే హతు లు, క్షతగాత్రుల సంఖ్య 130 శాతం పెరిగింది. ఈ ఏడాది కూడా ఈ ధోరణి కొనసాగుతోంది. ప్రతి రోజూ దాడులు జరుగుతూనే ఉన్నాయి.

అసోసియేట్‌ ప్రెస్‌ నివేదికలో…
అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఓ ప్రత్యే నివేదికలో ఉటంకించిన ఐరాస డేటా ప్రకారం…2023 జనవరి-2026 ఏప్రిల్‌ మధ్యకాలంలో వందకు పైగా వెస్ట్‌బ్యాంక్‌ గ్రామాలను పూర్తిగా లేదా పాక్షికంగా ఖాళీ చేయించారు. అదే సమయం లో ఇజ్రాయిల్‌ దళాలు ఆవాసాలు, కట్టడాలను కూల్చేయడంతో ఏడు వేల మందికి పైగా నిరాశ్ర యులయ్యారు. ఓ తాజా నివేదిక ప్రకారం సెటిలర్ల దాడులలో ఇజ్రాయిల్‌ అధికారులు ప్రత్యక్షంగా భాగస్వా ములయ్యారు. ఇజ్రాయిల్‌ అధికారుల ఆర్థిక, సైనిక మద్దతు ద్వారా ఈ దాడులు కొనసాగు తున్నాయి. సెటిలర్లు హింసకు పాల్పడుతు న్నప్పటికీ అధికారులు వారిని శిక్షల నుంచి కాపాడుతున్నారు. పాలస్తీనా చిన్నారులు తమ రోజువారీ పనులలో నిమగమై ఉన్నప్పుడు సెటిలర్లు వారిపై దాడులు చేస్తారు. అపహరించి వేధిస్తారు. పాలస్తీనీ యులపై లైంగిక హింసకు పాల్పడు తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. మహిళలు, బాలికలను భయపెట్టడం, వేధిం చడం నిత్యకృత్యమై పోయింది. వారిపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. పాలస్తీనీయులపై ఇజ్రాయిల్‌ సెటిలర్ల దాడులు సహించరానివని, వాటికి ముగింపు పలకాలని మురళీధర్‌ సూచించారు.

అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సైతం…
అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ కూడా ఇజ్రాయిల్‌ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలస్తీనాను స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ నుంచి పాలస్తీనీయులను తరిమివేయాలని చూస్తోందని మండిపడింది. ప్రభుత్వ మద్దతుతో సెటిలర్లు పెట్రేగిపో తున్నారని తన 149 పేజీల నివేదికలో అమ్నెస్టీ విమర్శించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -