- Advertisement -
హైదరాబాద్ : దిగ్గజ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తాజాగా అమెరికా మార్కెట్లోకి క్యాన్సర్ ఔషధాన్ని విడుదల చేసినట్లు తెలిపింది. ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ అనుబంధ సంస్థ అయిన వైత్ కు చెందిన క్యాన్సర్ నివారణ ఔషధం ‘బోసులిఫ్’కు ప్రత్యామ్నాయ జెనరిక్ వెర్షన్ బోసుటినిబ్ 400 ఎంజి టాబ్లెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు శనివారం వెల్లడించింది. ఈ క్యాన్సర్ జెనరిక్ డ్రగ్‌ను అమెరికా మార్కెట్లోకి తీసుకొచ్చిన మొట్టమొదటి సంస్థగా డాక్టర్ రెడ్డీస్ నిలిచిందని పేర్కొంది. రాబోయే ఆరు నెలల పాటు అమెరికా మార్కెట్లో ఈ డ్రగ్ విక్రయాల్లో కంపెనీకి మంచి వాటా లభించనుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
- Advertisement -



