ఐఫోన్ విడిభాగాల యూనిట్‌కు నోటీసులు
హోసూర్: ఆపిల్ ఐఫోన్ విడిభాగాలను తయారు చేసే ప్రముఖ దేశీయ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ కు తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు (టిఎన్‌పిసిబి) గట్టి షాక్ ఇచ్చింది. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న ఈ ప్లాంట్ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాల వల్ల సమీపంలోని వ్యవసాయ భూములు, బావుల్లోని భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయనే ఆరోపణలపై సంస్థకు హెచ్చరిక నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై మే 25 నాటి నోటీసుకు సరైన వివరణ ఇవ్వకుంటే ఫ్యాక్టరీని మూసివేయడంతో పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా భారతదేశంలో ఆపిల్ సరఫరా గొలుసులో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ తర్వాత టాటా ఎలక్ట్రానిక్స్ రెండవ అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తరుణంలో ఈ నోటీసులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న రసాయన వ్యర్థ జలాల వల్ల తమ పంట పొలాలు, బావులు కలుషితం అవుతున్నాయంటూ స్థానిక రైతులు గత కొన్ని నెలలుగా చేసిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు డిసెంబర్ 2025 నుండి మే 2026 మధ్య కాలంలో ఐదుసార్లు ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. ఈ ఫ్యాక్టరీతో వ్యవసాయ భూముల్లోని బావుల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని కాలుష్య మండలి నిర్ధారించింది.
టాటా ఫ్యాక్టరీకి టిఎన్‌పిసిబి షాక్
- Advertisement -
- Advertisement -



