Sunday, June 14, 2026
E-PAPER
Homeఖమ్మంఎమ్మెల్యే జారె ఆదినారాయణ వినూత్న కార్యాచరణ

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వినూత్న కార్యాచరణ

- Advertisement -

– లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ ఫలాలు
– పాఠశాలల సందర్శనతో విద్యా సంవత్సరానికి శ్రీకారం
– సోమవారం పర్యటన షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల పాలనా విధానాలకు భిన్నంగా ప్రజలకు చేరువయ్యే వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. సంక్షేమ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులను ప్రభుత్వ కార్యాలయాలకు పిలిపించి అర్హత పత్రాలు అందజేయడం ఆనవాయితీ కాగా, ఎమ్మెల్యే ఆదినారాయణ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పత్రాలు అందజేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

కొత్త విద్యా సంవత్సరం సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పాఠశాలల సందర్శనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మేరకు గండుగులపల్లిలోని వ్యక్తిగత క్యాంపు కార్యాలయం బాధ్యులు వట్టి వెంకట్రావు పర్యటన వివరాలను ఆదివారం విడుదల చేశారు.

ఉదయం 9 గంటలకు రెడ్డిగూడెం, ఉదయం 10 గంటలకు తిరుమలకుంట మరియు తిరుమలకుంట కాలనీ పాఠశాలలను సందర్శిస్తారు. అనంతరం తోగ్గూడెం ఎంపీపీ పాఠశాలలో రూ.17.50 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గోడలను ప్రారంభిస్తారు.

ఉదయం 10.30 గంటలకు మద్దులమడలో ఇటీవల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఇచ్చిన హామీలలో భాగంగా రూ.4 లక్షల వ్యయంతో జీపీఎస్ పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

ఉదయం 11.15 గంటలకు దిబ్బగూడెం పంచాయతీలోని దురదపాడు ఎంపీపీ పాఠశాలలో రూ.4 లక్షల వ్యయంతో నిర్మించిన బాలురు, బాలికల మల్టీ యూనిట్ మరుగుదొడ్లను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నారాయణపురం ఎంపీపీ పాఠశాలలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గోడల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 2 గంటలకు అశ్వారావుపేటలోని శ్రీ సత్య సాయి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, సోషల్ మీడియా ఇన్‌చార్జిలు, మండల మరియు మహిళా అధ్యక్షులతో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో అధికారులతో, సిబ్బందితో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

ఈ కార్యక్రమాల్లో మండల అధికారులు, ఆత్మ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, డైరెక్టర్లు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వివిధ సెల్‌ ల అధ్యక్షులు, సోషల్ మీడియా సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వట్టి వెంకట్రావు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -