పలు పార్టీల నాయకుల నివాళులు
నవతెలంగాణ – ఖమ్మం రూరల్
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య వీరభద్రం మాతృమూర్తి భూక్య కమలమ్మ (78) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలంలోని కస్నాతండా గ్రామానికి చెందిన ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కమలమ్మ మృతదేహాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కస్నాతండా గ్రామంలో పార్టీ అభివృద్ధికి, ప్రజా ఉద్యమాల బలోపేతానికి కమలమ్మ తన కుటుంబాన్ని అంకితం చేశారని, ఉద్యమాల కోసం తన కుమారులను కూడా ముందుకు తీసుకువచ్చిన త్యాగశీలి అని కొనియాడారు. ఆమె మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. కమలమ్మకు భర్త సామ్య నాయక్, కుమారులు భూక్య వీరభద్రం, నాగేశ్వరరావు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, సీపీఐ(ఎం) నాయకులు యర్రా శ్రీనివాసరావు, వై. విక్రమ్, బొంతు రాంబాబు, ఉరడీ సుదర్శన్ రెడ్డి, వడ్లమూడి నాగేశ్వరరావు, నండ్ర ప్రసాద్, ఎస్.కే మీరా సాహెబ్, షేక్ బషీరుద్దీన్, తాళ్లపల్లి కృష్ణ, భూక్య శ్రీను, దొడ్డ భారతమ్మ, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.. వెంకట్ ఫోన్ ద్వారా కమలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు భూక్య కమలమ్మ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



