Tuesday, July 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి

ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి

- Advertisement -

​14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలి :
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
​‌నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా


​నవతెలంగాణ – నల్లగొండ టౌన్

రేషన్‌ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను సరఫరా చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్ఓ)కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యన్నారు. ప్రజల ఆహార భద్రతకు ప్రజాపంపిణీ వ్యవస్థ కీలకమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా బియ్యంతోపాటు పప్పులు, వంటనూనె, చక్కెర, ఉప్పు, గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, కారం పొడి, పసుపు తదితర మొత్తం 14 రకాల నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందించాలని కోరారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా పరిమిత సరుకులు మాత్రమే అందుతుండటంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిదిద్ది, పేదలకు నాణ్యమైన సరుకులు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 14 రకాల నిత్యావసర వస్తువుల సరఫరాను వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ, జిట్ట సరోజ, జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి చానా బోయిన నాగమణి, ఎస్కే సుల్తానా, కారంపొడి ధనలక్ష్మి, నాయకులు గోలి వెంకటమ్మ, భవు రోజు ఇందిరా, కౌసల్య, ఫాతిమా, సైదమ్మ, భాగ్య, అలివేలు, శశికళ, వెంకటమ్మ, గుండెబోయిన విజయలక్ష్మి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -