Wednesday, June 17, 2026
E-PAPER
Homeజిల్లాలుఈనెల 20న మహబూబ్ నగర్ రానున్న త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్

ఈనెల 20న మహబూబ్ నగర్ రానున్న త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా జూన్ 20న మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ, ప్రదర్శన నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతల నాగరాజు తెలిపారు. కంసానిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో మాట్లాడుతూ.. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ మాణిక్ సర్కార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య, తమ్మినేని వీరభద్రం, బి. వెంకట్, జాన్ వెస్లీ తదితర ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. సభను విజయవంతం చేసేందుకు ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -