Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని శుక్రవారం మద్నూర్ మండల స్వర్ణకారులు తహశీల్దార్ ఎండి ముజీబ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్వబ్రాహ్మణ, స్వర్ణకారుల పాత్ర ఎనలేనిదని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బతుకులు మారతాయనుకుంటే, నానాటికి దిగజారి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ వారు పెద్ద ఎత్తున జూవెల్లరీ షాపులు నెలకొల్పుతూ మోసపూరితమైన ఆర్భాటపు ప్రకటనలు చేస్తూ.. స్వర్ణకారులను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల దృష్ట్యా స్వర్ణకారులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు. ఇందులో భాగంగా 3 డిమాండ్లను వినతిప్రతంలో పేర్కొన్నారు.

1. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పాలకమండలి నియమించాలి
2. జీవో నెంబర్ 272ను సవరించి, స్వర్ణకారులకు దొంగ బంగారం రికవరీ నుండి కాపాడాలి
3. 50 సంవత్సరాలు దాటిన స్వర్ణకార కుల వృత్తిదారులకు రూ.5 వేల పింఛన్ మంజూరు చేయాలి

కార్యక్రమంలో మండల స్వర్ణకారులు రఘు చారి, బాబు చారి, మల్లయ్య చారి, పెంటయ్య చారి, నాగేష్ చారి, శ్యామ్ చారి, రమేష్ చారి, గణేష్ చారి, రాహుల్ చారి, కృష్ణ చారి, గోపాల్ చారి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -