Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్లలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గోటు విలేజ్

తాడిచెర్లలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గోటు విలేజ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జులై 7న ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు సమీక్ష సమావేశం సోమవారం ఎమ్మార్సీస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా జిల్లా ఇంఛార్జి, ములుగు జిల్లా అధ్యక్షుడు మడి పెళ్లి శ్యాంబాబు మాదిగ హాజరై మాట్లాడారు.

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు విద్యా, సంస్థగత నిర్మాణం, జెండా ఆవిష్కరణల కోసం మాదిగ పల్లెల్లోకి ప్రతి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు వెళ్లి అక్కడి మాదిగ యువతను చైతన్యం చేసే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ, మహదేవ్పూర్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి తాండ్ర దినేష్ మాదిగ, నారమళ్ళ నవీన్ మాదిగ, బూడిద సారయ్య మాదిగ, నార మల్ల ఎర్ర పోచం మాదిగ, ఇందారపు శ్యామ్ మాదిగ, కేసరపు అరుణ మాదిగ, ఇందారపు శివ సాయి మాదిగ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -