నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని మంతపురి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నోముల చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంధమల్ల అశోక్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానన్నారు. మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేసే నాయకత్వం అవసరమని చంద్రశేఖర్ నాయకత్వంలో మంతపురి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పసుల సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ దంతూరి స్వామి, మాజీ సర్పంచ్ కర్రె ఎల్లయ్య, పట్టణ అధ్యక్షుడు సాగర్ రెడ్డి, నాయకులు అజయ్, కొరటూరి సిద్ధులు, సతీష్, సంతోష్ రెడ్డి, బాలరాజు, వార్డు సభ్యులు పల్లె మధు, ప్రవీణ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



