నవతెలంగాణ-మద్నూర్
ఈ నెల 25 నుండి జూలై 24వ వరకు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ కొనసాగుతుందని మద్నూర్ తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ తెలిపారు. మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మద్నూర్, డోంగ్లి మండలాల పరిధిలోని బిఎల్ఒ లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఒలు, బిఎల్ఎలు సమన్వయంతో పనిచేసి, ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డోంగ్లి తహసీల్దార్ రంజిత్, ఎలక్షన్ సెక్షన్ నాయబ్ తహశీల్దార్ శివ రామకృష్ణ, మద్నూర్ మండల గిర్దావర్ మురళీధర్, సాయిబాబా, ఎలక్షన్ సెక్షన్ అధికారులు యు రవి కుమార్, బాలరాజు, హన్మండ్లు, ప్రవీణ్, దశరథ్ లతో పాటు రెండు మండలాలకు చెందిన బి.ఎల్.ఒలు, బి.ఎల్.ఎలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ పై బీఎల్ఓ లకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



