Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.!

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.!

- Advertisement -

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..
నవతెలంగాణ – మల్హర్ రావు

ఇంటర్మీడియట్ పరీక్షలు రేపు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల పరీక్ష కేంద్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో పలు ప్రైవేటు కళాశాలలు విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వాలంటే ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తుండడంతో నేరుగా హాల్ టికెట్ను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు వెళ్లవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

మండలంలో తాడిచెర్ల జూనియర్ కళాశాల,ఎడ్లపల్లి మోడల్ స్కూల్,దుబ్బపేట కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలో ఫస్ట్ ఇయర్ 109,సెకండ్ ఇయర్ 76 మొత్తం 185 మంది,ఓకేషనల్ ఫస్ట్ ఇయర్ 15,సెకండ్ ఇయర్ 27 మొత్తం 42 మంది  విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.కాపాయింగ్ జరగకుండా పరీక్ష కేంద్రంలో కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు సెల్ఫోన్ను కూడా లోపలికి తీసుకెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.ఎవరు వెళ్లినా సెల్ఫోన్లను గేట్ వద్దే డిపాజిట్ చేసి వెళ్లాల్సి ఉంటుందని తాడిచెర్ల కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడారు హాల్ టికెట్ల కోసం విద్యా ర్థులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేరుగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెంటర్ పై పూర్తి పర్యవేక్షణ,144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు.ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు కొనసాగునట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -