నవతెలంగాణ – హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో అక్రమంగా అధికారాన్ని హస్తగతం చేసుకుందని, ప్రశ్నించిన బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేయించిందని కేటీఆర్ ఆరోపించారు. క్యాతన్‌పల్లిలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో జరిగిన అక్రమాన్ని ప్రశ్నించినందుకు బాల్క సుమన్‌ను జైల్లో పెట్టారని మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో.. నువ్వు మళ్లీ చిప్పకూడు తినే సమయం కచ్చితంగా వస్తుంది’ అని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని, బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశాయని కేటీఆర్ విమర్శించారు.
బాల్క సుమన్‌ను పరామర్శించిన కేటీఆర్
- Advertisement -
- Advertisement -



