Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చురుకుగా ఉపాధి హామీ పనులు

చురుకుగా ఉపాధి హామీ పనులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మహాదేవ్ కుంటలో చురుకుగా ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పనులు పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలు 182 హాజరయ్యారని జిప్సీ కార్యదర్శి భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమణ-సురేష్ మాట్లాడుతూ.. కూలీలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరు సమయాన్ని పాటించాలని కూలీలకు విజ్ఞప్తి చేశారు.

బస్వాపూర్ గ్రామంలో చాలామంది నిరుపేదలు ఉన్నారని, ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని 125 రోజు పని కల్పించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. కూలి డబ్బులు తొందరగా వచ్చే విధంగా కృషి చేస్తామని, ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనితో పాటు గ్రామ అభివృద్ధికి సహకారించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -